Sunday, May 12, 2024

సమ్మక్క సారక్క ఆశీస్సులతో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు

spot_img

సమ్మక్క సారక్క ఆశీస్సులతో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారన్నారు ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి. నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను..బీఆర్ఎస్ అభ్యర్థులపై సమ్మక్క సారక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. నాపై నమ్మకంతో టికెట్ ప్రకటించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బడే నాగజ్యోతి. నిన్న నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడే ములుగులో విజయం ఖాయమైందన్నారు. పనులు ఎవరు చేస్తారు అనేది ములుగు ప్రజలకు అందరికి తెలుసునని..ములుగు జిల్లాకు మంచి నీళ్ళు ఇంటింటికీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ హయాంలోనే  మెడికల్ కాలేజీ కూడా వచ్చిందన్నారు బడే నాగజ్యోతి.

మాటలు ఎవరివీ.. చేతలు ఎవరివీ అనేది అందరికి తెలుసునని అన్నారు బడే నాగజ్యోతి. నాకు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి…ములుగు ఎమ్మెల్యే గా గెలిసి కేసీఆర్ కు కానుకగా ఇస్తా అని చెప్పారు.

Latest News

More Articles