Sunday, April 28, 2024

శుభ్‌మ‌న్ గిల్‌ త్రిబుల్ ధమాకా

spot_img

న్యూఢిల్లీ: 25వ ఎడిష‌న్ సియ‌ట్ క్రికెట్ రేటింగ్స్‌ అవార్డుల్లో టీమిండియా ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌ హవా నడిచింది. ఈ యంగ్‌స్ట‌ర్‌  ‘సియ‌ట్ మెన్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్’, ‘సియ‌ట్ ఇంట‌ర్నేష‌నల్ బ్యాట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్’, ‘సియ‌ట్ వ‌న్డే బ్యాట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్’ అవార్డులు గెలుచుకున్నాడు. 2022 -23 సీజ‌న్‌లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన మేల్, ఫీమేల్ క్రికెట‌ర్ల‌ను సియ‌ట్ సంస్థ ఈరోజు స‌త్క‌రించింది.

ముంబైలో జ‌రిగిన 25వ అవార్డుల వేడుక‌లో మాజీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్, భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పాల్గొన్నారు.  ‘టీ20 బ్యాట‌ర్‌’గా సూర్య‌కుమార్ యాద‌వ్, ‘టీ20 బౌల‌ర్‌’గా భువ‌నేశ్వ‌ర్ ఎంపిక‌య్యారు. పొట్టి క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన మొద‌టి భార‌త బౌల‌ర్‌గా య‌జ్వేంద్ర చాహ‌ల్ దక్కించుకున్నారు. ‘ఉమెన్స్ ఇంట‌ర్నేష‌నల్ క్రికెట‌ర్‌’గా ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ అవార్డు అందుకున్నది.

ఆస్ట్రేలియా లెగ్ స్పిన్న‌ర్ ఆడం జంపాకు ‘వ‌న్డే బౌలర్ ఆఫ్ ది ఇయ‌ర్’ అవార్డు ద‌క్కింది. ‘ఇంట‌ర్నేష‌న‌ల్ బౌల‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్’ అవార్డును న్యూజిలాండ్ పేస‌ర్ టిమ్ సౌథీ గెలుచుకున్నాడు. ‘టెస్టు బౌల‌ర్‌గా’ ప్ర‌భాత్ జ‌య‌సూర్య‌, ‘టెస్టు బ్యాట‌ర్ ఆఫ్ ది ఇయర్‌’గా కివీస్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ నిలిచారు. ‘డొమెస్టిక్ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌’గా జ‌ల‌జ్ స‌క్సేనా నిలిచింది. ‘బెస్ట్ కోచ్ అవార్డు’ను ఇంగ్లండ్ కోచ్ బ్రెండ‌న్ మెక్‌క‌ల్లం అందుకున్నారు.

Latest News

More Articles