Friday, May 10, 2024

తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ మారే ఛాన్స్..!

spot_img

తెలంగాణ టెట్  కు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయింది. మే 20వ తేదీ నుంచి పరీక్షలు కూడా ప్రారంభం అవుతాయని అధికారులు షెడ్యూల్ కూడా ప్రకటించారు. జూన్ 06వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంటుంది. అయితే పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. మే 27వ తేదీన తెలంగాణలోని గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ (ఖమ్మం, నల్గొండ, వరంగల్) స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇదే తేదీన పోలింగ్ ఉంది. దీంతో ఆ రోజే జరగాల్సిన టెట్ పరీక్ష ఉంటుందా..? లేక వాయిదా షెడ్యూల్ మారుస్తారా అనేది ప్రశ్నగా మారింది.

మే 20న తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభమైన జూన్ 06వ తేదీన ముగుస్తాయి. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ కూడా ప్రకటించారు. అయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి (ఉపఎన్నిక) సంబంధించి తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 27వ తేదీన పోలింగ్ ఉంటుందని ప్రకటించింది. అయితే ఈ మూడు జిల్లాల్లోని గ్రాడ్యూయేట్లు ఈ ఓటింగ్ లో పాల్గొంటారు. ఇందులో చాలా మంది టెట్ రాసేవారు ఉంటారు. అదే రోజు పోలింగ్..మరోవైపు ఎగ్జామ్ ఉంటే… ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇదే అంశంపై విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. పోలింగ్ లో పాల్గొనేందుకు ఇబ్బందులు లేకుండా..ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇక ఈసారి నిర్వహించబోయే టెట్ పరీక్ష కోసం మొత్తం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్ 1 కోసం 99,210 మంచి నుంచి అప్లికేషన్లు రాగా… పేపర్‌-2 కు 1,84,231 మంది అప్లయ్ చేశారు.

ఇది కూడా చదవండి: లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.!

Latest News

More Articles