Tuesday, May 21, 2024

రిజర్వేషన్లు రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు

spot_img

రిజర్వేషన్లు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులని.. వాటిని రద్దు చేసే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేశారు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌. ఇవాళ(శుక్రవారం) కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాలు వినోద్ కుమార్ క్యాంపు కార్యాలయంలో కలిసి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వినోద్ కుమార్.. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సీఎం రేవంత్ ఎస్సీ, ఏస్టీ రిజర్వేషన్లు తీసేస్తారని భయపెడుతున్నారని అని అన్నారు. మరో వైపు బీజేపీ వాళ్లు కాంగ్రెస్ వస్తే రిజర్వేషన్లు రద్దు చేసి ముస్లింలకు ఇస్తారని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు..125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులని, వాటిని రద్దు చేసే హక్కు ఎవరికి లేదన్నారు. వీటిని ముట్టరాదని 2006లో సుప్రీంకోర్టు జడ్జి కూడా తీర్పునిచ్చారని తెలిపారు వినోద్ కుమార్. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రాజకీయాల కోసమే ఈ విషయాన్ని లేవనెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:లోక్‌సభ ఎన్నికలు.. హైదరాబాద్‌లో ఆంక్షలు

Latest News

More Articles