Tuesday, May 21, 2024

కాంగ్రెస్ శ్రేణులు..బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోబోం

spot_img

కాంగ్రెస్ శ్రేణులు.. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోబోమన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఎర్రబెల్లి. కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తే భయపడే స్థితిలో లేమన్నారు. ఒక్కరి జోలికి వచ్చినా వంద మందిని ఉరికిస్తామని హెచ్చరించారు. ఇవాళ(శుక్రవారం) వర్ధన్నపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఎర్రబెల్లి.. తాము అధికారంలో లేకపోయినా కార్యకర్తలను కాపాడుకున్నానని, ఇప్పుడు కూడా కార్యకర్తలకు ఎలాంటి చిన్న అపాయం జరిగినా సహించబోనని అన్నారు.

దివంగత రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌లోకి రావాలంటూ తనకు రూ. 100 కోట్లు ఆఫర్ చేశారని తెలిపారు ఎర్రబెల్లి. మంత్రి పదవి కూడా ఇస్తానని హామీ ఇచ్చినా తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదన్నారు. తాను పార్టీ మారకపోవడంతో..వైఎస్ఆర్ కోపంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారని ఆరోపించారు. తదుపరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం జనరల్ కాబోతోందని, మళ్లీ తానే గెలుస్తానని స్పష్టం చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గం దయన్న అడ్డా.. ఇకపై ఇక్కడే ఉంటానని అన్నారు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి ఏడవటంతో సానుభూతి ఏర్పడిందని, అందుకు ఓటర్లను ఆమెను గెలిపించారని అన్నారు.

రేవంత్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయితే …తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం రేవంత్ రెడ్డి తన శిష్యుడేనని, ఎప్పుడూ నిలకడా ఉండని వ్యక్తి అని విమర్శించారు. తాను ఎప్పుడూ చంద్రబాబును, ఎన్టీఆర్‌ను తిట్టలేదని తెలిపారు ఎర్రబెల్లి. తెలంగాణలో ఏడాది లోపు అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. మరోవైపు  కడియం శ్రీహరిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద మోసకారి అని విమర్శించారు. చంద్రబాబును, కేసీఆర్‌ను కూడా ఆయన మోసం చేశారని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఈ ఎన్నిక‌ల్లో ప్రాంతీయ పార్టీల‌దే హ‌వా

Latest News

More Articles