Friday, May 10, 2024

సీతాదేవిగా సాయిపల్లవి..రాముడిగా రణబీర్..ఫొటోలు వైరల్.!

spot_img

రామాయణ్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా ఎలాంటి హంగామా లేకుండానే షూటింగ్ మొదలు పెట్టారు. సాయిపల్లవి సీతాదేవిగా,రణ్ బీర్ కపూర్ శ్రీరాముడి అవతారంలో ఉన్న ఫొటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో  వైరల్ అవుతున్నాయి. సీతాదేవిగా సాయిపల్లవి లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు అచ్చం సీతాదేవిలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. సాయిపల్లవి అందానికి మంత్రముగ్దులవుతున్నారు. ప్రతిష్టాత్మక రామాయణం ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపు అన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదారణ పొందాయి. అయితే గతేడాది విడుదలైన ఆదిపురుష్ మాత్రం ట్రోలింగ్ గు గురైంది. కాగా ఈ రామయణ్ మూవీలో రావణుడిగా కేజీఎఫ్ ఫేమ్ యష్ కనిపించనున్నారు. రాముడు, సీతకు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ మారే ఛాన్స్..!

Latest News

More Articles