Monday, May 20, 2024

ఎయిర్ ఇండియా సిబ్బంది సమ్మె విరమరణ.!

spot_img

ఎయిరిండియా యాజమాన్యం, సిబ్బంది మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. రెండు రోజులుగా ఆందోళన బాటపట్టిన ఉద్యోగులు సమ్మె విరమించారు. అనారోగ్య కారణాలతో మూకుమ్మడిగా సెలవు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించింది ఎయిరిండియా సంస్థ. దీంతో 25మంది సిబ్బందిని తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. మరింత మందిని తొలగిస్తామని హెచ్చరించడంతో ఉద్యోగులుదిగి వచ్చారు. దీంతో సమ్మెను విరమించారు. ఈ క్రమంలో సిబ్బంది తొలగింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం సహావారిపై పెట్టిన కేసులను సమీక్షించేందుకు ఎయిరిండియా యాజమాన్యం అంగీకరించినట్లు సమాచారం.

తక్కువ వేతనం, సమానత్వం వంటి విషయాల్లో యాజమాన్యం తీరుపై అసంత్రుప్తితో ఉన్న మూడువందల మంది సిబ్బంది సామూహిక సెలవు పెట్టడం వల్ల వందల సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిబ్బంది తీరుపై ఆగ్రహించిన యాజమాన్యం 25మందిని తొలగిస్తున్నామని గురువారం సాయంత్రంలోగా మిగతావారందూ విధుల్లో చేరకుంటే కఠిన చర్యలు తీసుకోవల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ వార్నింగ్ నేపథ్యంలో ఉద్యోగులు విధుల్లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఆలయాల్లో గన్నేరు పూల వాడకం నిషేధం..ఎందుకో తెలుసా?

Latest News

More Articles