Tuesday, May 21, 2024

గుండెపోటుతో సచివాలయం ఉద్యోగి మృతి.. వేధింపులే కారణమా?

spot_img

రాష్ట్ర సచివాలయంలో విషాదం నెలకొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి వేధింపులు భరించలేక సచివాలయ ఉద్యోగి గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. రాహుల్ అనే ఉద్యోగి కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని దగ్గర పీఏగా పనిచేస్తున్నారు. కొన్నిరోజులు పనిప్రదేశంలో రాణి కుముదిని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ తోటి ఉద్యోగులు ఆరోపించారు. సచివాలయంలోని రాణి కుముదిని ఛాంబర్ ముందు సచివాలయ ఉద్యోగులు బైఠాయించి నిరసన తెలిపారు. మరణించిన రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

కాగా సెక్రటేరియట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ అనుమానస్పద మరణంగా భావిస్తూ.. సి ఎస్ శాంతి కుమారుని కలవడానికి సెక్రటేరియట్ ఉద్యోగులు వెళ్లారు. రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. 7 మే 2024 ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుమిదిని పేషీ లో ఔట్సోర్సు కింద 11 సంవత్సరాల నుండి పనిచేస్తున్న రాహుల్ మధ్యాహ్నం 12 గంటలకు అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది స్పందించి అంబులెన్స్ కు ఫోన్ చేసి సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు తరలించారు.

డబ్బులు ఎక్కువ అవుతాయి అనే ఉద్దేశంతో నిమ్స్ హాస్పిటల్ కుతీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చారు. గుండె శస్త్ర చికిత్స ఆపరేషన్ తో పాటు డయాలసిస్ చేయగా ఆపరేషన్ సక్సెస్ అయి 48 గంటల అబ్జర్వేషన్ లో ఉన్న రాహుల్ నిన్న రాత్రి 9 గంటలకు మరణించారు.33 సంవత్సరాల రాహుల్ పురాణ పోల్ కు చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి.రాణి కుమిదిని సీరియస్ గా మందలించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. లా పరీక్షలకు సంబంధించిన వైవా ఎగ్జామ్ కూడా రాహుల్ కు ఉన్నట్టు తెలుస్తుంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా  చదవండి: నేటితో కేసీఆర్ బస్సు యాత్ర ముగింపు.!

Latest News

More Articles