Tuesday, May 21, 2024

ఛత్తీస్‎గఢ్‎లో భారీ ఎన్‎కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు హతం.!

spot_img

లోకసభ ఎన్నికల వేళ ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల ప్రకారం గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు శుక్రవారం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ను చేపట్టాయి. ఈక్రమంలోనే ఇరుపక్షాల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.

కాగా ఘటనాస్థలం నుంచి ఐదుగురు మావోయిస్టుల డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నామని భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. స్థానికంగా గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు. కాగా గత కొన్నాళ్లుగా మావోయిస్టులు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత నెల 16వ తేదీన కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ 29 మంది మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్ గఢ్ చరిత్రలోనే అతిపెద్ద ఎన్ కౌంటర్ ఇది. ఆ తర్వాత ఏప్రిల్ 30వ తేదీన నారాయణ్ పూర్, కాంకేర్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించారు.

ఇది కూడా చదవండి: ఫోన్ పే బంపర్ ఆఫర్..ఫ్రీగా రూ.2వేలు..పూర్తి వివరాలివే.!

Latest News

More Articles