Friday, May 10, 2024

లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.!

spot_img

ఈ రోజుల్లో ఏదైనా లేకపోవచ్చు కానీ చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరేమో. అవసరంకోసం వచ్చిన ఆ ఫోన్ ఇప్పుడు అనర్థాలకు కారణం అవుతోంది. ముఖ్యంగా చేతిలో ఫోన్ ఉంది..డబ్బు అవసరం అనిపిస్తే లోన్ యాప్ ల వైపు చూస్తున్నారు. ఏదో అవసరం తీరుతుందని ఆశపడితే..ఆ తర్వాత అసలైన కష్టాలు షురూ అవుతాయి. ఎందుకంటే ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లో విపరీతమైన లోన్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అందులో ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించిన యాప్ లు ఎన్నో ఉన్నాయి. అవసరానికి అందులో నగదు తీసుకోవడం తర్వాత ఇబ్బందులకు గురికావడం వంటివి చాలా జరుగుతున్నాయి. ఈ లోన్ యాప్ ఆగడాలకు సుసైడ్ చేసుకునే వారి సంఖ్యా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

తాజాగా సంగారెడ్డిలో ఇలాంటి ఘటనే జరిగింది. లోన్ యాప్ లో అప్పుతీసుకుని తిరిగి చెల్లించలేక వారి వేధింపులు తట్టుకోలేక వినీత్ అనే బీటెక్ చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది. రూ. 25లక్షలు అప్పు తీసుకున్న వినీత్..క్రికెట బెట్టింగ్ లో పెట్టి నష్టపోయాడు. అప్పు చెల్లించాలని యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఏం చేయాలో తోచక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: గూగుల్‌ లో రాజకీయ ప్రకటనల కోసం బీజేపీ పెట్టిన ఖర్చు రూ.100 కోట్లు

Latest News

More Articles