Friday, May 10, 2024

వామ్మో..మరో మూడు రోజులు నరకమే.!

spot_img

నిప్పుల కొలిమి ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫ్యాన్, ఏసీ, కూలర్ ఇవి తిరుగుతున్నా చెమటలు కారిపోతూనే ఉన్నాయి. కాలు బయటకు పెడదామంటే గజగజ వణకాల్సి వస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న ఎండ వేడిమి నుంచి బయట పడలేకపోతున్నాము. ఎంత అర్జెంట్ పనులున్నా సూర్యుడు రాకముందే చేసుకోవాలి. లేదా సాయంత్రం చేసుకోవాలి. కాదని బయటకు వెళ్లామా వడదెబ్బ తగలక మానదు. ఇంకెన్ని రోజులు ఎండలు ఉంటాయో చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రానురాను వర్షాభావ పరిస్ధితులు రానున్నాయి. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా స్పల్పంగా ఉండటం వంటివి జరుగుతున్నాయి. భానుడి భగభగమంటూ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 దాటిదంటే బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్ధితి నెలకొంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో చాలా మంది శీతలపానీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. మరో వారంరోజులపాటు 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదు అవుతాయని..వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాక హెచ్చరిస్తోంది. అత్యవసరం అయితే తప్పా బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి; లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.!

Latest News

More Articles