Friday, May 10, 2024

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో చూశారా?

spot_img

ఏపీలోని వైఎస్సార్ సీపీ తాజాగా తన ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సీఎం వైఎస్ జగన్ రెడ్డి తాజాగా మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇందులో పలు రకాల ఆకర్షణీయ ప్రకటనలు చేశారు. గత స్కీంను కొనసాగిస్తూనే లబ్దిని మాత్రం పెంచుతూ హామీలు కురిపించారు. వైఎస్ జగన్ రిలీజ్ చేసిన రెండు పేజీల మేనిఫెస్టోలో ఎలాంటి ప్రకటనలు ఉన్నాయనే అంశాన్ని తెలుసుకుందాం. 9 ముఖ్యమైన హామిలిచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నతవిద్య, అభివ్రుద్ది, పేదలకు ఇల్లు, నాడునేడు, మహిళ సాధికారత, సామాజిక భద్రత ఇవి ఉన్నాయి.

చేయూత సాయం కింద రూ. 75వేలు అందిస్తామని జగన్ చెప్పారు. అమ్మఒడి కింద రూ. 17వేలు అందిస్తామని హామిచ్చారు. ఇది వరకు రూ. 15వేల అందించారు. కాపు నేస్తం హామీ కూడా ఉంది. రూ. 60వేలు ఇస్తారు. సున్నా వడ్డీ కింద రూ. 3లక్షల లోన్ ఇవ్వనున్నారు. ఈబీసీ నేస్తం రూ. 60వేలు అందిస్తారు. అర్హులైన వారికి ఇల్ల స్థలాలు ఇవ్వనున్నారు. రెండు విడతల్లో పెన్షన్ నూ. 3500కు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇక రైతు భరోసాను పెంచుతూ హమీ కూడా ఉంది. రూ. 16వేలు అందిస్తామని తెలిపారు. వాహనమిత్ర కింద రూ. 10వేలు ఎప్పటిలాగే అందిస్తామని భరోసా ఇచ్చారు. కౌలు రైతుకు కూడా వైఎస్సార్ భరోసా,. కల్యాణ మస్తు, షాదీ తోఫా కొనసాగింపు ఉంటుందని మేనిఫెస్టోలో చెప్పారు.

ఇది కూడా  చదవండి: వామ్మో..మరో మూడు రోజులు నరకమే.!

Latest News

More Articles