Monday, May 13, 2024

రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.. బాల్క సుమన్ ఫైర్

spot_img

మంచిర్యాల జిల్లా : రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.. దళిత ఎమ్మెల్యేలమైన మాపై చేసిన ఆరోపణలను దళిత సమాజం చూస్తోంది. తెలంగాణ ఉద్యమం నాడు చంద్రబాబు చెప్పులు మోసిన ఘనత నిది. నువ్వా మా పై మాట్లాడేది. రేటెంత రెడ్డికి వందల కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కుని పోటీకి వచ్చిర్రు వినోద్, వివేక్ లు అని చెన్నూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ విరుచుకుపడ్డారు.

Also Read.. టీమిండియా ఇప్పుడు కప్ గెలవలేకపోతే మరో 12 ఏళ్లు ఆగాల్సిందే

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డిలు పాల్గొన్నారు.

Also Read.. నన్ను ఎదుర్కొనే శక్తి లేక అంతం చేసేందుకు కుట్ర

ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ..  ఉస్మానియా ఉద్యమ కారులను, విద్యార్థి నాయకులను వాడుకున్న కాంగ్రెస్ పార్టీ..వారికి టికెట్ ఎందుకు ఇయ్యలేదని ప్రశ్నించారు. వివేక్, వినోద్ లు నియోజక వర్గాలలో బిఆర్ఎస్ నేతలను కోట్ల రూపాయలకు అర్రాసు పాట పాడి కొనడం లేదా. కాంగ్రెస్ పార్టీ కోసం తన ఇల్లును వెంకటస్వామి ఇస్తే, కనీసం పార్టీ ఆఫీస్ లో ఆయన పార్థివ దేహం కూడా పెట్టనివ్వలేదని గుర్తుచేశారు. సిఎం కేసీఅర్ ట్యాంక్ బండ్ మీద కాక వెంకటస్వామి విగ్రహం పెట్టించారు. నా దగ్గర వందల వేల కోట్లు రూపాయలు ఉన్నాయన్న రేవంత్ నా ఆస్తులు చూపించాలి, లేదంటే మంచిర్యాల చౌరస్తాలో ముక్కు భూమికి రాయాలని డిమాండ్ చేశారు.

Also Read.. ఎమర్జెన్సీ బ్రేకులు వేసిన రైలు డ్రైవర్… ఇద్దరు వ్యక్తులు మృతి

పార్టీలు మార్చి, కడుపులు కొట్టిన ఘనత రేవంత్ రెడ్డి ది. నిలకడ,నిబద్ధతలు లేక పార్టీలు మారుతున్న వ్యక్తులు వినోద్, వివేక్ లు స్వలాభం కోసమే కార్పొరేట్ రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి టికెట్ లు అమ్ముకోవడం నిజం కాదా. కార్పోరేట్ రాజకీయాలు మా దగ్గర నడువవ్. ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలి. కాంగ్రెస్ నాయకులు ఓటర్లను డబ్బులతో కొనుగోలు చేయడానికి కుట్రలు చేస్తున్నారు.  మేము గొడవలు చెయ్యాలనుకుంటే వేరేలా ఉంటది. మేము సంయమనం పాటిస్తున్నం. వినోద్,వివేక్ లు గెలిస్తే నియోజక వర్గాలలో ఫ్యుడలిస్ట్ వ్యవస్థ వస్తది. రానున్న ఎన్నికల్లో పక్కాగా 80 సీట్లకు పైగా గెలుస్తం. ఈ జిల్లాలో మూడు సీట్లను గెలిచేది బిఆర్ఎస్ పార్టీనే అని బాల్క సుమన్ స్పష్టం చేశారు.

Latest News

More Articles