Sunday, June 30, 2024

రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదు

spot_img

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై… ఆగ్రహంతో ఊగిపోయిన బాల్క సుమన్ ముఖ్యమంత్రిని నేను కూడా చెప్పుతో కొడతానన్నారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బాల్క సుమన్  మాట్లాడుతూ… రేవంత్ రెడ్డిపై అనుచిత పదాలు వాడారు. ఆ తర్వాత ఇలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు.

రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు బాల్క సుమన్. కేసీఆర్‌ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండగాడు, హౌలేగాడు అని అన్నారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదని.. సంస్కారం అడ్డువచ్చి ఆగుతున్నామని అన్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు

Latest News

More Articles