Sunday, May 19, 2024

యూట్యూబ్ ‘లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ స్కామ్‌: రూ. 3.3 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి..!!

spot_img

YouTube “like and subscribe” scam : యూట్యూబ్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్ చేస్తే భారీగా లాభాలు ఇప్పిస్తామని చెప్పడంతో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి రూ. 3.3 లక్షలు పెట్టుబడి పెట్టి అడ్డంగా మోసపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. చామ్‌రాజ్‌పేట పోలీస్ స్టేషన్‌కు చెందిన 29 ఏళ్ల లోకప్ప ఉత్తంగికి స్కామర్‌లు వేర్వేరు యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం, సబ్‌స్క్రైబ్ చేస్తే.. పెట్టుబడి పెట్టిన దానిపై 30 శాతం లాభాలు ఇస్తామని ప్రకటించారు. దీంతో తొలుత 1,000-3,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి.. లాభాలను తీసుకున్నాడు. అదే క్రమంలో  ఆగస్టు 1-9 తేదీల మధ్య రూ.3.3 లక్షలు ఇన్వెస్ట్ పెట్టాడు. కానీ ఈసారి రిటర్న్ లు రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన ఉత్తంగి ఆగస్టు 29న ఫిర్యాదు చేశాడు.

KTR Visits Dubai తెలంగాణకు మరో భారీ పెట్టుబడి. రూ.1600 కోట్లతో రానున్న తబ్రీద్

ఆగస్టు 1న అంజలి రాథోడ్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మహిళ అతడిని టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరమని ఆహ్వానించింది. తిరిగి డబ్బులు ఇప్పిస్తానని హామీ ఇచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే రోజు రూ.1000 చెల్లించి తనకు ఇచ్చిన పనులు పూర్తి చేసి తిరిగి రూ.300 తీసుకున్నాడు. మరుసటి రోజు, అతను రూ. 1,000, రూ. 3,000 చెల్లించి బదులుగా వరుసగా రూ. 300, రూ. 900 తిరిగిపొందాడు.  దీంతో నమ్మకం కుదరడంతో తన భార్య,  స్నేహితులతో రూ. 3.3 లక్షలు పెట్టుబడి పెట్టించి అడ్డండా బుక్ అయ్యాడని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

Latest News

More Articles