Friday, May 3, 2024

బతుకమ్మ ఆడిన హైకోర్టు మహిళ న్యాయమూర్తులు..!!

spot_img

హైదరాబాద్ నాంపల్లి కోర్టులో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. నాంపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యఅతిధిలుగా మహిళా న్యాయమూర్తులు హాజరయ్యారు. కోర్టు సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణకు చెందిన జస్టిస్ జువ్వడి శ్రీదేవి, జస్టిస్ శ్రీసుధా, జస్టిస్ సురేపల్లి నంద, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి ప్రేమావతి బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. బతుకమ్మ సంబురాల సందర్భంగా ఉత్తమంగా డ్యాన్స్ చేసిన ఉద్యోగులకు బహుమతులను ప్రదానం చేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మహిళా ఐపీఎస్ లు బతుకమ్మ సంబురాల్లో ఆడిపాడారు. మహిళ ఐపీఎస్ లతో పాటు మహిళా పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిత్యం న్యాయవ్యవస్థలో బిజీగా గడిపే జడ్జీలు బతుకమ్మ సంబురాల్లో పాల్గొని అందర్నీ ఆకట్టుకున్నారు.

Latest News

More Articles