Saturday, May 18, 2024

ష‌మీ ఘ‌న‌త‌ల్ని గుర్తు చేసేలా.. బీసీసీఐ ట్వీట్..!!

spot_img

భార‌త జ‌ట్టు సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ నిన్న‌ బర్త్ డే జరుపుకున్నారు. నిన్నటితో షమీ 33వ ప‌డిలోకి అడుగుపెట్టాడు. ఈ సంద‌ర్భంగా ఈ స్టార్ బౌల‌ర్ ఘ‌న‌త‌ల్ని గుర్తు చేసేలా బీసీసీఐ ఓ ట్వీట్ చేసింది.

Organ Donation నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన హరిత..!

2019 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ష‌మీ స్పెల్ హైలెట్. అఫ్గ‌నిస్థాన్‌పై చెల‌రేగిన అత‌ను హ్యాట్రిక్ సాధించాడు. 50వ ఓవ‌ర్ వేసిన ష‌మీ వ‌రుస బంతుల్లో మ‌హ‌మ్మ‌ద్ న‌బీ, అఫ్తాబ్ అలాం, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ ల‌ను పెవిలియ‌న్ పంపాడు. ఈ ఫీట్‌తో వ‌ర‌ల్డ్ క‌ప్‌లో హ్యాట్రిక్ తీసిన రెండో భార‌త బౌల‌ర్‌గా ష‌మీ రికార్డు సృష్టించాడు. భారత బౌలర్ గా చేత‌న్ శ‌ర్మ  1987లో మొదటగా ఈ ఘ‌న‌త సాధించాడు.

టీమిండియా సక్సెస్ బౌల‌ర్ల‌లో ఒక‌డై ష‌మీ.. 177 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 415 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతోపాటు అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా ష‌మీ ఘనత సాధించారు.

Latest News

More Articles