Saturday, May 18, 2024

హైకమాండ్‌పై బండి అలక వెనుక.. ఇంత భయం ఉందా ?

spot_img

ఏ సమయంలో బీజేపీ 52 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిందో కానీ ఒకటే రచ్చ. బీజేపీ ప్రకటించిన తొలి జాబితా ఆ పార్టీలో చిచ్చుపెట్టింది. టికెట్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలు.. లిస్ట్‌లో తమ పేరు లేకపోయేసరికి తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అయితే టికెట్ వచ్చినా కూడా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కూడా అధిష్టానంపై అలకబూనాడని తెలుస్తోంది.

కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ పేరును ప్రకటించినప్పటికీ.. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్, వేములవాడ టికెట్లను పెండింగ్‌లో పెట్టడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట. తన అనుచరులకు ఆ రెండు సీట్లు కోరినప్పటికీ ప్రకటించకపోవడంపై కినుక వహించారట. అలాగే స్టార్ క్యాంపెయినర్‌గా కాకుండా.. తనను కరీంనగర్ వరకే పరిమితం చేశారని తమ అనచరుల వద్ద వాపోయారని ప్రచారం జరుగుతోంది.

ఆదివారం తొలి జాబితా విడుదలైన తర్వాత తన అనుచరులు, కార్యకర్తలతో బండి సంజయ్ సమావేశమై.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారట. గతంలో తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని.. ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదని వాపోయారట. తనకు ప్రాధాన్యత లేని చోట.. ఉండడం అనవసరమని, అలాగని తాను వేరొక పార్టీలోకి వెళ్లలేనని.. ఈ నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పుకుంటే బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే తనకు ఇచ్చిన కరీంనగర్ సీటులో గెలవటం కష్టం కాబట్టే బండి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తనకి వస్తున్న ఇమేజ్ కి ఒకవేళ ఓడిపోతే రాజకీయంగా తీరని నష్టం వాటిల్లుతుందని అందుకే బండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. ఓటమి భయం బండిని రాజకీయాలకే దూరం చేయబోతోందా లేక యూటర్న్ రాజకీయమే చూస్తామా అన్నది కాలమే నిర్ణయించాలి.

Latest News

More Articles