Sunday, May 12, 2024

సెక్రటేరియట్ ముందు బైక్ విన్యాసాలు.. వీడియో వైరల్

spot_img

హైదరాబాద్ మహానగరంలో యువకులు రెచ్చిపోయారు. నగరంలో అర్థరాత్రి బైక్‎లపై విన్యాసాలు చేస్తూ హల్చల్ చేశారు. సోషల్ మీడియాలో ట్రేండింగ్ కోసం ప్రముఖ ప్రాంతాల్లో బైక్ స్టంట్స్ చేసి అప్ లోడ్ చేశారు. కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్, సెక్రటేరియట్‎తో పాటు పలు ప్రాంతాల్లో బైక్ పై భయంకరమైన విన్యాసాలు చేస్తూ వాటిని వీడియో తీసి సోషల్ మీడియా‏లో పోస్ట్ చేశారు. వీటిని చూసిన ఓ నెటిజన్.. ఇలాంటి ప్రాంతాల్లో బైక్‎లపై విన్యాసాలు చేయడంతో సాధారణ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని ట్విట్టర్‎లొ పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ వీడియోను హైదరాబాద్ పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు, రోడ్డు సేఫ్టీ అధికారులకు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశాడు. ఇటువంటి వాటికి పాల్పడిన యువకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. స్పందించిన పోలీసులు.. ఆ వీడియో ఆధారంగా యువకుడిని గుర్తించే పనిలో పడ్డారు.

Read also: ఓటేయడానికి కెనడా నుంచి వచ్చిన తెలంగాణ యువకుడు

Latest News

More Articles