Friday, May 3, 2024

దేశంలో ఆకలి లేని రాష్ట్రం తెలంగాణ

spot_img

హైదరాబాద్: దేశంలో ఆకలి, దారిద్ర్యాలు లేని రాష్ట్రం తెలంగాణ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని ఏడవ వార్డు ఇందిరమ్మ కాలనీ పేస్ 2 లో బిజెపి మాజీ పట్టణ అధ్యక్షుడు కొండేటి ఏడుకొండలు బిజెపికి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి, దేశానికి శ్రీరామరక్ష అన్నారు. దేశవ్యాప్తంగా 30 శాతం మంది ప్రజలు ఒక్క పూట భోజనం మాత్రమే తింటూ మిగతాపూట పస్తులు ఉంటే, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం  ఆకలి  దారిద్ర్యాలను లేకుండా చేసింది అన్నారు.

దేశంలో నేటికీ రెండు పూటలా తిండి తింటున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. దేశంలో ఇంటింటికి 24 గంటల కరెంటు త్రాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ చాలా గ్రామాల్లో కరెంటు లైన్ లు కూడా లేవన్నారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా45 లక్షల మంది కి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో సైతం 40 వేల మందికి పెన్షన్ లు అందజేస్తున్నామన్నారు.

మన రాష్ట్రంలో వృద్ధులకు 2000, వితంతువులకు 3000, వికలాంగులకు 4000 పెన్షన్ ఇస్తుండగా,ప్రధాని మోడీ  బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్న పెన్షన్ ఆరు వందలే అంటూ ఏద్దేవా చేశారు. దేశంలో ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వారే అని అన్నారు.

సూర్యాపేటలో 2014 ముందు వేసిన ఓటు ఓటు ద్వారా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్న మంత్రి, 2014లో కారు గుర్తుకు వేసిన ఓటు సూర్యాపేట ప్రజలను మూసి మురికి నుండి విముక్తి కల్పించింది అన్నారు. మెడికల్ కాలేజ్, మినీ ట్యాంక్ బండ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు వేసిన ఓటు ద్వారానే వచ్చాయన్నారు. 2014 ముందు మూసి ప్రాజెక్టు గేట్లు శిథిలావస్థకు చేరి నీరు వృధాగా పోతున్నా పట్టించుకున్న వారే లేరన్నారు. తాను గెలిచిన మరుక్షణమే ముఖ్యమంత్రి దృష్టికి మూసి మూసి ప్రాజెక్టు దుస్థితిని తీసుకొచ్చి గేట్లను ఆధునికరించామన్నారు. తద్వారా 30 వేల ఎకరాల్లో  1000 కోట్ల విలువ చేసే పంటలు  పండించారని తెలిపారు.

సూర్యాపేట సుందరీకరణలో ఇంకా చేయవలసింది చాలా ఉందన్న మంత్రి, దేశంలో నెంబర్ వన్ పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దే యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఇచ్చిన హామీలను  నిలబెట్టుకున్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్, బిజెపిలు చేయలేని అభివృద్ధి, 9 ఏళ్ళలోనే  చేసింది  కేసీఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం  చేసిందన్నారు.

సూర్యాపేట ను నెంబర్ వన్ సుందరమైన పట్టణంగా చేసుకుందాం అన్న మంత్రి, అభివృద్ధిలో భాగస్వామ్యం ఎందుకు టిఆర్ఎస్ లో చేరిన ఏడుకొండలు, మహిళా మోర్చా నాయకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. గులాబీ కండువా కప్పి సాధారంగా టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో జాయిన్ అయిన వారిలో  పాల్వాయి వెంకన్న శైలజ, పాపారావు అశోక్, లక్ష్మయ్య, చారి, నిర్మల, శ్రీరాములు, సైదా, మరో 200 మంది బిజెపి కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకులు ఉన్నారు.

Latest News

More Articles