Sunday, May 12, 2024

ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి

spot_img

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలుచేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పాలన్నారు. ఇటలీ నుంచి తెస్తారా లేదా కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసు నుంచి తెస్తారో స్పష్టంచేయాలన్నారు.

ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ పార్టీ ప్రభుత్వం తమ యుద్ధం మొదలైందని చెప్పారు. కాంగ్రెస్‌, ఎంఐఎం ఒకటేనని విమర్శించారు.

అక్బరుద్దీన్‌ ముందుకు ప్రమాణం చేసేది లేదని.. ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. అందుకే స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ముందు ప్రమాణం చేశామన్నారు. అసెంబ్లీ ఫ్లోర్‌ లీడర్‌ ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. మంచివ్యక్తికే బాధ్యతలు అప్పగిస్తుందని, ఫ్లోర్‌ లీడర్‌ ఎవరైనా ఎనిమిది మంది ఎమ్మెల్యేలం కలిసే పనిచేస్తామన్నారు. తాను పార్టీ కూలగొడతానని అనలేదని, ఆ పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.

Latest News

More Articles