Friday, June 28, 2024

షకీల్ హ్యాట్రిక్ ఖాయమేనా ?

spot_img

2014, 2018 తరువాత.. ముచ్చటగా ముడోసారి బీఆర్ఎస్ పార్టీ బోధన్ టికెట్ మహ్మద్ షకీల్ కు కేటాయించారు. దీంతో ముడోసారి విజయం సాధించేందుకు షకీల్ పావులు కదుపుతున్నారు. 2014,2018లో మొహమ్మద్ షకిల్ అమీర్ వరుసగా రెండుసార్లు గెలుపు జెండా ఎగిరేసిన షకీల్ హ్యాట్రిక్ పై కన్నేశాడు. 2009లో టీఆర్ఎస్ పార్టీలో చేరి బోదన్ ఎమ్మెల్యేగా పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్ధి సుదర్శన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.2014, 2018లో వరుసగా టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు.

బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ బోదన్ నుంచి అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఎమ్మెల్యే షకీల్ కు మరొసారి ఆవకాశం కల్పించారు. ముచ్చటగా ముడోసారి విజయం సాధించాలని షకీల్ తన వ్యూహలకు పదును పెడుతున్నారు. అయితే ఈ సారి కాంగ్రెస్, బాజపా లు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని.. ముఖ్యంగా కేసీఆర్ బొమ్మ చాలన్న దీమాగా ఉన్నారు ఎమ్మెల్యే షకీల్. మొత్తంగా బోదన్ నియోజకవర్గ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో, ఎవరికి పట్టం కడతారో వేచిచూదాం.

Latest News

More Articles