Friday, May 17, 2024

పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు బుక్ ఫెయిర్

spot_img

పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్’ తేదీలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 36వ బుక్ ఫెయిర్ ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు జరగనుంది. ఈ మేరకు బుక్ ఫెయిర్ కమిటీ సోమవారం ప్రకటించింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎన్టీఆర్ స్టేడియం వేదికగా దీనిని నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యవర్గ సభ్యులు నిర్ణయించారు. బుక్ ఫెయిర్ ఆఫీస్‌లో అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ నేతృత్వంలో సోమవారం కార్యవర్గ సమావేశం జరిగింది. పుస్తక ప్రియులు, పాఠకులు ఈ ఏడాది బుక్ ఫెయిర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యవర్గ సభ్యులు కోరారు.

Read Also: ఆరు గ్యారెంటీల అమలుకు త్వరలో ఇంటింటి సర్వే

Latest News

More Articles