Sunday, May 19, 2024

పాట పాడుతూ స్టేజీపైనే కుప్పకూలిన యంగ్ సింగర్.. వైరలవుతున్న వీడియో

spot_img

నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెసంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది గుండెపోటుతో మరణించారు. దీనంతటికి కారణం మన జీవనశైలే. ఒక్కప్పుడు 60ఏళ్లు పైబడిన వారికి గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు ఎవరికి, ఎప్పుడు గుండెపోటు వస్తుందో ఊహించలేం.

Read Also: శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

తాజాగా బ్రెజిల్ గోస్పెల్ సింగర్ పెడ్రో హెన్రిక్ (30) లైవ్ ప్రదర్శన ఇస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఊహించని పరిణామంతో ప్రదర్శనకు హాజరైన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డి శాంటాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేజ్‌పై లైవ్‌ ప్రదర్శన ఇస్తున్న సమయంలో పెడ్రో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. దీంతో అక్కడున్న వారు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పెడ్రో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే అతడు మరణించినట్లు తెలిపారు. స్టేజ్‌పై సింగర్‌ కుప్పకూలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బ్రెజిల్‌ గోస్పెల్ మ్యూజిక్‌లో రైజింగ్ స్టార్‌గా పెడ్రో పేరు సంపాదించుకున్నాడు. ఆయణ మరణవార్తతో హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

Latest News

More Articles