Monday, May 20, 2024

ఈ ఎన్నికల తర్వాత సర్కార్ ఉంటుందో..ఉడుతదో చెప్పలేం.!

spot_img

లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కరీంగనగర్ జిల్లాలో కేసీఆర్ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లోకసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఈప్రభుత్వం ఉంటుందో..ఊడుతుందో ఏం జరుగుతుందో తెలియనదని అనుమానం వ్యక్తం చేశారు. యాదవ సోదరుల కోసం అప్పట్లో తాము గొర్రెలు పంపిణీ, మత్స్యకారుల కోసం చేపపిల్లల స్కీంలు తీసుకువస్తే ఇవేం స్కీములంటూ కాంగ్రెస్ నేతలు ఎగతాళి చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.

కాంగ్రెస పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాదవులకు రూ. 2లక్షలు ఇస్తామని చెప్పి గొర్రెల పథకాన్ని బంద్ చేశారంటూ ఫైర్ అయ్యారు. ఒక్క హుజూరాబాద్ లోని దళితబంధు పథకాన్ని 20వేల కుటుంబాలకు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ మరోసారి గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు దళితబంధును రూ. 12లక్షలకు పెంచి ఇస్తామని ఒక్కరికీ ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు తక్షణమే డీఏలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని, విద్యార్థులను, ఉద్యోగులను, రైతులను, మత్స్యకారులను, యాదవులను, దళితులను ఇలా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు కూడా తీసుకోవడం లేదన్నారు.

ఇది కూడా చదవండి:రేపే అక్షయ తృతీయ..వీటిని కొనుగోలు చేస్తే మీ ఇంట సిరిసంపదలకు కొదువ ఉండదు..!

Latest News

More Articles