Monday, May 20, 2024

రాహుల్‌ సభ అట్టర్ ప్లాప్..పిల్లల్ని పిలిచినా నిండని కుర్చీలు.!

spot_img

బుధవారం సాయంత్రం సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ ఎన్నికల సభ నిర్వహించింది. చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి మూడు పార్లమెంట్ నియోజకర్గాల ప్రచార సభ..కావడంతో భారీగా జనం తరలివస్తారని ఊహించింది. కానీ ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ వచ్చేసరికి 100 మంది కూడా లేరు. కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. జనం లేరన్న విషయాన్ని తెలుసుకున్న్ రాహుల్ గాంధీ బయటే ఉండిపోయారు. కారవాన్ కూడా దిగకపోవడంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వ్యాన్ దిగి రోడ్డుమీదికి వచ్చి స్టేడియం వద్ద నిలబడి ప్రజలను లోపలికిపంపించారు.

అప్పుడే వస్తున్న ప్రజలను లోపలికి పదండి అంటూ గట్టిగా పురమాయించారు. భద్రతసిబ్బంది, కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడున్న వారిని స్టేడియంలోపలికి పంపడం మీడియా కంటపడింది. ఈ విధంగా దాదాపు 45 నిమిషాల పాటు జనాన్నీసమీకరించారు. అంతసేపూ సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపైనే వేచి ఉన్నారు. రాహుల్ కారవాన్ లోనే ఉండిపోయారు. చివరకు రాత్రి 7.10 రాహుల్ వేదిక మీదకు వచ్చారు. మొత్తానికి కొంతమంది జనం రావడంతో సభ మొదలైంది. బహిరంగసభ ముగిసే సరికి మైదానంలో 2వేల మంది కూడా లేరు. దీంతో రాహుల్ నిరాశగా కనిపించారు. 16నిమిషాల్లోనే ఆయన ప్రసంగాన్ని ముగించేశారు. దీంతో కాంగ్రెస్ లో కలవరం మొదలైంది.

ఇది కూడా చదవండి: ఈ ఎన్నికల తర్వాత సర్కార్ ఉంటుందో..ఉడుతదో చెప్పలేం.!

Latest News

More Articles