Monday, May 20, 2024

నిరుద్యోగులకు శుభవార్త..ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు..పూర్తివివరాలివే.!

spot_img

బ్యాంకులో ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త అందించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ మేరకు సంస్థలో 12వేల ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించింది. ఐటీ, ఇతరత్ర డిపార్ట్ మెంట్లలో నియామకాలకు నోటిఫికేషన్ వేయబోతున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

అభ్యర్థులను ఎంపిక చేసి కామన్ స్టాఫ్, అసోసియేషన్ స్టాఫ్ గా దాదాపు 85 శాతంమంది ఇంజనీర్లు ఉండే వ్యవస్థను తయారు చేయనున్నట్లు తెలిపారు. అందరికీ బ్యాంకింగ్ ను అర్థం చేసుకునే విధంగా ట్రైనింగ్ ఇస్తానమి వెల్లడించారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,35,858 నుంచి 2,32,296కి పడిపోయిందన్నారు. టెక్నికల్ స్కిల్స్ కోసం కొత్త ఉద్యోగులను కూడా తీసుకోవాలని నిర్ణయించినట్లుగా ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: నేటి నుంచి తెరచుకోనున్న కేదార్ నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు.!

Latest News

More Articles