Monday, June 24, 2024

విజయకాంత్‌ మరణం పట్ల కేసీఆర్‌ సంతాపం

spot_img

ప్రముఖ తమిళ నటుడు డీఎండీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడిగా కళారంగానికి, రాజకీయ వేత్తగా ఆయన చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. విజయకాంత్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయకాంత్‌ కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్‌ దవాఖానలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్‌ తుదిశ్వాస విడిచారు.

ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు. 71 ఏండ్ల విజయకాంత్‌ ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో చెన్నైలోని మియోట్‌ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్‌ 11న ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పుడే ఆయన మరణించారనే వార్తలు నెట్టింట షికారు చేశాయి. అయితే ఆ వదంతులను ఆయన సతీమణి ప్రేమలత కొట్టిపారేశారు. అయితే రెండు వారాలు గడువకముందే ఆయన కొవిడ్‌ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విజయకాంత్‌.. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో సైతం అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.

 

Latest News

More Articles