Monday, May 20, 2024

మోదీపై బీఆర్‌ఎస్ సరికొత్త అస్త్రం

spot_img

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రధాని మోదీపై సరికొత్త అస్త్రం ప్రయోగించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. రాష్ట్రంలో మోదీ పర్యటన ఖరారైన నేపథ్యంలో పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదాను తెరపై పోరాటానికి సిద్ధమైంది. కేంద్రం ఎలాగో రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదన్న అంశాన్ని మోదీ పర్యటన సందర్భంగా మరోసారి తెరపైకి తీసుకువచ్చి ఒత్తిడి పెంచేందుకు వ్యూహం రెడీ అవుతుంది.

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 1న రాష్ట్రానికి రానున్నారు మోదీ. దీంతో అలర్ట్ అయిన అధికార బీఆర్‌ఎస్.. మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అస్త్రాలను సిద్ధం చేసుకుంది. తెలంగాణపై కేంద్రం అవలంభిస్తున్న విధానాలను ఎండగడుతూ రాజకీయంగా బీజేపీని కార్నర్ చేయాలనీ క్యాడర్ ని సంసిద్ధం చేస్తుంది.

పాల‌మూరు జిల్లాకు వ‌స్తున్న ప్రధాని మోదీని.. అదే జిల్లాకు చెందిన ప్రధాన అంశంతో అటాక్ చేసేందుకు బీఆర్‌ఎస్ స్కెచ్ గీస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లా బతుకు చిత్రాన్ని మార్చి ఆ జిల్లాకు పచ్చతోరణం కట్టేందుకు సంకల్పించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్రం చేసిందేమి లేదని ప్రజలకి బలంగా చెప్పనుంది. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి.. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా ఇవ్వకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నిస్తోంది బీఆర్‌ఎస్.

Latest News

More Articles