Sunday, May 19, 2024

కవిత ఆధ్వర్యంలో మధ్య ప్రదేశ్ లో పీడిత్ అధికార్ యాత్ర

spot_img

కేంద్రంలో బీసీలకు ప్రత్యే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కవిత చెప్పారు. బీసీల కులగణనను వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా మధ్య ప్రదేశ్ లో పీడిత్ అధికార్ యాత్రను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఇక యాత్రను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో కేసీఆర్ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదని, ఎన్ని ఒడిదిడుకులు ఎదురైనా లక్ష్య సాధన కోసం పనిచేసి తెలంగాణ సాధించారని వివరించారు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగించి ఉద్యమాన్ని నడిపించారని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు సీఎంగా ఉండి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశారని, ముఖ్యంగా రైతుల కోసం కేసీఆర్ చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేయలేదని చెప్పారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు లైన్లు కట్టే పరిస్థితిని పారద్రోలారని గుర్తు చేశారు. రైతులకు పెట్టబడిసాయం చేయడమే కాకుండా పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే యంత్రాంగాన్ని సృష్టించారని తెలిపారు.

తెలంగాణను సీఎం కేసీఆర్ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి దాదాపు 30 లక్షల మంది ఉద్యోగాలు కలిగేలా చేశారని గుర్తు చేశారు. కానీ ఝాన్సీ రైల్వే స్టేషన్ ను చూస్తే మధ్య ప్రదేశ్ నుంచి వలసలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందని, పెద్ద పరిశ్రమలు లేని కారణంగా చదువుకున్న పిల్లలు కూడా దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఇటువంటి పరిస్థితులు మధ్య ప్రదేశ్ లో మారాలని ఆకాంక్షించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఓబీసీ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని, ఎందుంటే ఓబీసీలు ఐక్యంగా లేరు కాబట్టి ప్రభుత్వాలు ఆ డిమాండ్ ను పెడచెవిన పెడుతున్నాయని, కాబట్టి ఓబీసీలకు ఐక్యం చేయడానికి దామోదర్ యాదవ్ ముందడుగు వేయడం ప్రశంసనీయమని స్పష్టం చేశారు. ఓబీసీలకు, మహిళలకు, ఇతర అణగారిన వర్గాలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో తగిన వాటా లేకపోవడం ఆందోళనకరమని అన్నారు.

Latest News

More Articles