Friday, May 17, 2024

ప్రాజెక్ట్ లు అప్ప‌గింత‌పై బీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న

spot_img

కృష్ణా నదిపై ఉన్న రెండు కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై ఇవాళ(శుక్రవారం) ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఆ తర్వాత  కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను ఎంపీల బృందం కలిసింది. తమకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ లేఖను అందజేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని.. వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కృష్ణా ట్రైబ్యునల్‌లో విచారణ పూర్తయ్యేవరకు రెండు రాష్ట్రాలకు 50:50 పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: భారత షూటర్ అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం

 

 

 

Latest News

More Articles