Friday, May 17, 2024

గులాబీ జెండా నిరుపేదలకు అండ

spot_img

ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలంలో తనకంటే ఎక్కువ ప్రజలకు సేవ చేస్తాడు,  ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి మన కందాళ.. ఉన్న ఎమ్మెల్యేల అందరికంటే విభిన్న వ్యక్తి కందాళ అని మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అన్నారు. BRS పార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి బుధవారం కూసుమంచి మండలం జుజ్జుల్ రావుపేట, వాల్యా తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Also Read.. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు షాకిచ్చిన కాంగ్రెస్ రెబల్

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, కేసిఆర్ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేశారన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ గారి కే దక్కిందన్నారు.

Also Read.. ఎప్పుడైనా మా ఊరుకొచ్చావా? కాంగ్రెస్ అభ్యర్థిని నిలదీసిన ఓటర్లు

బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయకు అందిస్తామని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను 6వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు. కావున ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

Latest News

More Articles