Sunday, June 16, 2024

కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తోందంటూ బీఆర్ఎస్ సంచలన ట్వీట్.!

spot_img

బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేసింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంటోంది. బీఆర్ఎస్ ముఖ్యనేత , మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీధర్ రెడ్డి హత్యపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. తెలంగాణలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు పాల్పడుతుందని ఫైర్ అయ్యింది. గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొలేకనే ఇలాంటి పిచ్చిపనులు కాంగ్రెస్ చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు అరాచకాలు, దాడులు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ హత్యా రాజకీయాలు ఆపకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించింది.

గత 5నెలల కాలంలో ఇద్దరు బిఆర్ఎస్ నాయకులు హత్యకు గురికావడం దురదృష్టకరం అని..గత పది సంవత్సరాలుగా రాజకీయాలలో చెదురు ముదురు సంఘటనలు తప్ప ఒక్క హింసాత్మక చర్యగానీ,హత్యలుకాని జరగలేదని అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎన్నికల తర్వాత సోదరభావంతో అందరినీ కలుపుకొని ప్రజాస్వామ్యయుతంగా పాలన చేశామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ ద్వేషాలను వ్యక్తిగత ద్వేషాలుగా తీసుకొని గతములో గంట్రావ్ పల్లెలో మల్లేష్ యాదవ్, నిన్న రాత్రి లక్ష్మిపల్లీలో శ్రీధర్ రెడ్డిని దారుణంగా గొడ్డలతో నరికి చంపారు.దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ నిరంజన్ రెడ్డి అన్నారు.

ప్రజాస్వామ్యంలో హత్యలకు తావు లేదని నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి అని ఆత్మస్థైర్యం కొల్పోవొద్దన్ని అండగా ఉంటాం అని చెబుతూ శ్రీధర్ రెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.జిల్లా ఎస్.పితో మాట్లాడిన నిరంజన్ రెడ్డి సమగ్ర విచారణ చేసి హత్య చేసిన వారిని ప్రోత్సహించిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: నేడు బుద్ధ పూర్ణిమ..గజకేసరి యోగంతో ఈ రాశివారి అదృష్టం మారిపోతుందట..!

Latest News

More Articles