Friday, May 17, 2024

మల్కాజిగిరి మాదే.. బీఆర్ఎస్ ప్రభంజనం తట్టుకోలేరు

spot_img

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో మల్కాజిగిరి సీటుపై కన్నేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ వినిపిస్తుంది. ఇందులో భాగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈ సీటు దక్కించుకునేలా ప్రణాళికలు చేస్తున్నాడట. ఇప్పటికే చంద్రబాబు జైలు పాలవ్వటంతో.. టీడీపీతో పొత్తు పెట్టుకుని పొలిటికల్ అడ్వాంటేజ్ పై ఫోకస్ పెట్టారు పవన్. ఈ నేపథ్యంలో తెలంగాణలోను పొత్తులపై బీజేపీ అధిష్టానంతో కీలక చర్చలు జరుపుతున్నారు. ఇక పొత్తులో భాగంగా బీజేపీ ఈ సీటును జనసేనకే కేటాయించవచ్చని కూడా సదురు రిపోర్టులు అందుతున్నాయి.

అయితే 2018 ఎన్నికల్లో 75వేల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ మల్కాజిగిరిలో సంచలన విజయం సాధించింది. బీజేపీ కీలక నేత రామచంద్రరావుని చిత్తుగా ఓడించింది బీఆర్ఎస్. ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ కానుందని సర్వేలు చెప్తున్నాయి. కేవలం సెటిలర్స్ ఓట్లని చీల్చడానికే బీజేపీ, జనసేన చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలించవని బీఆర్ఎస్ చెప్తుంది. తెలంగాణలో సెటిల్ అయిన ఏపీ ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని.. కంటికి రెప్పలా వారిని కాపాడుకుంటూ వస్తున్న కేసీఆర్ తోనే సెటిలర్స్ ఉన్నారని.. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరని నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.

Latest News

More Articles