Tuesday, May 14, 2024

బతుకమ్మ ముందు మందుబాటిళ్లా?.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవనరెడ్డిపై మహిళల ఆగ్రహం

spot_img

తెలంగాణ ఆడపడచులు గొప్పగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ. గౌరమ్మను బతుకమ్మలో చూసుకుంటూ.. 9 రోజులు ఆడిపాడుతారు. మహిళలు అంత గొప్పగా చేసుకునే పండుగను కించపరుస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దారుణంగా మాట్లాడారు. బతుకమ్మ ముందు మందు బాటిళ్లు పెట్టి ఆడాలనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై మహిళలు మండిపడుతున్నారు.
బతుకమ్మను అవమాన పరిచేలా మాట్లాడిన జీవన్‌రెడ్డి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. జీవన్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. బతుకమ్మ పండుగకు అసలైన వైభవం తెచ్చింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితేనని స్పష్టంచేశారు. మందు బాటిళ్లు పెట్టి బతుకమ్మ ఆడాలనే వ్యాఖ్యలు అభ్యంతరకరమని చెప్పారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగిత్యాలలో ఓటమి అని తెలిసే జీవన్‌రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు ఒక్క ఎమ్మెల్సీ కవితనే అవమానపరచినట్లు కాదని, మొత్తం తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానపర్చినట్లని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. బతుకమ్మ పండుగపై కాంగ్రెస్‌ నాయకులు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బతుకమ్మలో మందు బాటిళ్లు, సారా బాటిళ్లు పెట్టే సంస్కృతి కాంగ్రెస్‌ నాయకులకు ఉందేమోనని ఎద్దేవాచేశారు. తెలంగాణలో రాహుల్ గాంధీ షోలు ప్లాప్ షోలుగా మారాయన్నారు. కాంగ్రెస్‎కు అధికారం రావడం కల్ల అని తెలిసే ఆ పార్టీ నేతలు అసహనంతో మాట్లాడుతున్నారన్నారు. ప్రియాంకకు మందు బాటిళ్లు పెట్టే బతుకమ్మను ఇచ్చారా అని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దల దగ్గర కాంగ్రెస్ నేతలు తెలంగాణ అస్థిత్వాన్ని తాకట్టు పెట్టారన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో పెట్టుబడుల కుంభ కోణంలో రాహుల్ బెయిల్ పై ఉన్నారు.. ఆయన నీతులు చెబుతారా అంటూ ప్రశ్నించారు.

Read Also: బీజేపీ మహిళా ఎంపీకి రూ. 137 కోట్ల ఫైన్

తెలంగాణ మహిళా సమాజాన్ని, సంస్కృతి, సంప్రదాయాన్ని కాంగ్రెస్‌ నేతలు అవమానపరుస్తున్నారని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలత ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం తెలంగాణభవన్‌ వద్ద జీవన్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్‌ మహిళా నాయకులు దహనం చేశారు.

Latest News

More Articles