Tuesday, May 14, 2024

లక్కీడ్రాలో జాక్‎పాట్ కొట్టిన ఇండియన్.. 25 ఏండ్లపాటు నెలకు రూ. 5.6 లక్షలు

spot_img

మనకు ఏదైనా దక్కాలంటే ఆవ గింజంత అయినా అదృష్టం ఉండాలి అంటారు. ఇక్కడో వ్యక్తికి ఆవ గింజంత కాదు.. గుమ్మడి కాయంత అదృష్టం ఉంది. లక్కీ డ్రాలో ఏకంగా రూ. 16 కోట్ల జాక్‎పాట్ కొట్టేశాడు. తమిళనాడుకు చెందిన 49 ఏళ్ల మాగేష్‌ కుమార్‌ నటరాజన్‌ అంబూరులో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఆయన 2019లో ఉద్యోగంలో భాగంగా సౌదీ అరేబియాలోని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వెళ్లాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాల్లో బయట తిరిగేవాడు. ఆ సమయంలో ఆయన లక్కీ డ్రా టికెట్లను చూసి ఆసక్తిగా FAST5 టికెట్‎ను కొనుగోలు చేశాడు. అయితే తాజాగా తీసిన లక్కీ డ్రాలో నటరాజన్ టికెట్ మొదటి బహుమతి గెలుపొందింది. ఈ డ్రా ద్వారా ఆయన 25 సంవత్సరాల పాటు నెలకు 25,000 దిర్హమ్స్ అంటే మన కరెన్సీలో నెలకు రూ. 5.6 లక్షలు అందుకోనున్నాడు. కాగా.. ఈ ప్రైజ్ అందుకున్న మొదటి విదేశీ వ్యక్తిగా నటరాజన్ నిలిచాడు.

Read Also: బతుకమ్మ ముందు మందుబాటిళ్లా?.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవనరెడ్డిపై మహిళల ఆగ్రహం

ఈ డబ్బుతో తన కుమార్తెలను బాగా చదివించుకంటానని, అదేవిధంగా తన కుటుంబానికి ఉజ్వల భవిష్యత్తును అందించాలని అనుకుంటున్నట్లు మాగేష్ తెలిపాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి కొంత డబ్బు కేటాయిస్తానని చెప్పాడు.

Latest News

More Articles