Sunday, April 28, 2024

తెలంగాణలో 107 మందిపై అనర్హత వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం

spot_img

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రం మొత్తం రాజకీయంగా హీటెక్కింది. ఆయా పార్టీలు తమ ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. కాగా.. ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. అభ్యర్థుల గురించి కూడా ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. వారిపై ఏమైనా కేసులు నమోదు అయ్యాయా అని తెలుసుకుంటోంది.

Read Also: బతుకమ్మ ముందు మందుబాటిళ్లా?.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవనరెడ్డిపై మహిళల ఆగ్రహం

తెలంగాణకు చెందిన 107 మంది రానున్న శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశాన్ని కోల్పోయారు. వారిపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయడమే ఇందుకు కారణం. గత ఎన్నికల్లో పోటీ చేసిన సదరు అభ్యర్థులు.. వారి ఖర్చుకు సంబంధించిన వివరాలను సమర్పించనందుకు వారిపై అనర్హత వేటు పడింది. వారిలో 72 మంది లోక్ సభ స్థానాల్లో పోటీ చేయడం విశేషం. ఎలక్షన్ కమిషన్ వేటుకు గురైన వారిలో ఒక్క నిజామాబాద్ లోక్ సభ నియోజకర్గానికి చెందినవారే 68 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది.

Read Also: లక్కీడ్రాలో జాక్‎పాట్ కొట్టిన ఇండియన్.. 25 ఏండ్లపాటు నెలకు రూ. 5.6 లక్షలు

మిగిలిన వారిలో మెదక్, మహబూబాబాద్ నుంచి ఒక్కొక్కరు, నల్గొండ లోక్ సభ స్థానం నుంచి ఇద్దరు ఉండగా వారిపై అనర్హత వేటు పడింది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి అనర్హత వేటుకు గురైన వారు 35 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 10ఏ కింద వారందరిపైనా అనర్హత వేటు వేసినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ అనర్హత వేటు 2021 జూన్ నుంచి వర్తించనుందని, 2024 జూన్ వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Latest News

More Articles