Saturday, May 11, 2024

తెలుగు రాష్ట్రాలకు తీపికబురు..ఈ జిల్లాల్లో వర్షాలు.!

spot_img

తెలుగు రాష్ట్రాలను ఎండలు పగబట్టినట్లున్నాయి. ఉదయం 9 దాటిందటంటే భానుడు భగభగ మండిపోతున్నాడు. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందించింది వాతావరణశాఖ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇది జరిగితే ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించినట్లే.తెలంగాణతోపాటు ఏపీలోనూ ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. పొద్దునే ఎండ తీవ్రంగా ఉంటోంది. దీంతో జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పొద్దు పొద్దునే లేదా సాయంత్రం ఎండ తక్కువగా ఉన్నప్పుడే మాత్రమే పనులు కోసం బయటకు వస్తున్నారు.

కొంతమంది తప్పనిపరిస్థితుల్లో గొడుగులు పట్టుకుని బయటకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి దెబ్బకు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయతే ఎండలు ఉన్నప్పటికీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనా వేయడం మాత్రం కష్టమే. తెలంగాణలో పలు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే ఈ మూడు రోజుల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

వచ్చే రెండు రోజులు వేడి, తేమతో కూడిన పరిస్థితి ఉండే ఛాన్స్ ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులుతో వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని చోట్ల వేడి, తేమతో కూడిన పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది.

ఇది కూడా చదవండి: మహిళలకు బంగారం లాంటి వార్త. పసిడి రూ.1300, వెండి రూ. 2,500 పతనం.!

Latest News

More Articles