Saturday, May 11, 2024

మహిళలకు బంగారం లాంటి వార్త. పసిడి రూ.1300, వెండి రూ. 2,500 పతనం.!

spot_img

బంగారం కొనాలన్న ఆలోచనలో ఉన్నారా. అయితే మీకో బంగారం లాంటివార్త. ఏంటో తెలుసా. బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. ఈ మధ్య కాలంలో గరిష్టస్థాయికి చేరుకున్న బంగారం ఇప్పుడు పడిపోయింది. వారం రోజుల్లోనే బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. దీంతో పసిడి ప్రేమికులకు ఊరట లభించిందని చెప్పవచ్చు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగిరావడంతో దేశీయ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు బలహీనంగానే కదులుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. గోల్డ్ కొనాలని చూసేవారికి ఇది సానుకూల అంశమని చెప్పవచ్చు. హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖ, వంటి ప్రాంతాల్లో బంగారం ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం.

నేటి ధరలన చూసినట్లయితే బంగారం ధర రూ. 72,930 పలుకుతోంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. అదే 22క్యారెట్ల బంగారం ధర అయితే ఈ రేటు 66,850 వద్ద ఉంది. ఇది 10గ్రాములకే వర్తిస్తుంది. వారంరోజుల కిందట అంటే ఏప్రిల్ 21న బంగారం ధర రూ. 74,240 ఉంది. అంటే ఈ వారంలో రోజుల్లో ఏకంగా రూ. 1300 తగ్గింది. ఇది 24క్యారెట్ల బంగారానికి వర్తిస్తుంది. అదే 22క్యారెట్ల బంగారం అయితే రూ. 66,850 వద్ద ఉంది. కానీ వారం కిందట రూ. 68,050 ఉంది. ఈ రేటు దాదాపు రూ. 1200వరకు తగ్గింది. వెండి కూడా వారం కిందట రేటు రూ. 86,500గా ఉంది. నేడు రూ. 84వేలుకు దిగివచ్చింది.

ఇది కూడా చదవండి: ఆగస్టు 15లోపు రుణమాఫీ..అంత ఈజీ కాదు.!

Latest News

More Articles