Saturday, May 11, 2024

ఆగస్టు 15లోపు రుణమాఫీ..అంత ఈజీ కాదు.!

spot_img

అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2లక్షల రైతు రుణమాఫీ చేస్తామంటూ నమ్మించిన సీఎం రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట దాటవేస్తున్నారని రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి మూడు సార్లు మాట తప్పారని..మరోసారి మాట తప్పరనే గ్యారేంటీ ఏముందని రైతులు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించారని..దీన్ని నమ్మలేమని రైతులు చెబుతున్నారు. రైతుబంధు అంశంలోనూ ఇదేవిధంగా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ఆగస్టు 15లోపు రూ. 2లక్షల రుణమాఫీ పూర్తి చేయడంకష్టమే అంటున్నారు ఆర్థిక, బ్యాంకింగ్ నిపుణులు. రుణమాఫీ అనేది ముఖ్యమంత్రి చెప్పినంత సులభం కాదంటున్నారు. జూన్ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి అప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు అంటున్నారు. మిగిలిన రెండు నెలల్లోనే మార్గదర్శకాలు రూపొందించడం, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, బ్యాంకుల నుంచి లెక్కలు తెప్పించుకోవడం, బ్యాంకుల రుణాలను కార్పొరేషన్ కు బదిలీ చేయించడంసాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం రుణమాఫీపై మార్గదర్శకాలను రూపొందించలేదు. కటాఫ్ తేదీని కూడా నిర్ణయించలేదు. బ్యాంకర్లు రైతుల రుణాల వివరాలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు నాలుగు నెలల సమయం పడుతుందని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఆగస్టు 15లోపు రుణమాఫీ ఏవిధంగా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి:వైద్యశాస్త్రంలో ముందడుగు..చర్మ క్యాన్సర్ కు టీకా.!

Latest News

More Articles