Sunday, May 12, 2024

కల్కి రిలీజ్ డేట్ ఫిక్స్..వచ్చేది ఆరోజే.!

spot_img

ఎట్టకేలకు కల్కీ 2898 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైజయంతీ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిభ, ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్.సూపర్ స్టార్ అయిన అమితాబ్, కమల్ హాసన్ కూడా ఈ మూవీలో భాగం కావడంతో కల్కి 2898 పై భారీ అంచనాలే ఉన్నాయి. సైన్స్ , మైథాలజీని మిళితం చేసి..ఓ వినూత్నమైన ఆలోచనతో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ పై గత కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొంది.

రిలీజ్ డేట్ పై అనుమానాలకు తెరదించుతూ విడుదల తేదీని మూవీ మేకర్స్ శనివారం ప్రకటించారు. జూన్ 27న కల్కి 2898 రిలీజ్ కానుంది. దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో దిశాపటానీ కూడా నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మధ్యే ద్రోణసుతుడైన అశ్వద్దామగా అమితాబ్ బచ్చన్ ను పరిచయం చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను మరోలోకానికి తీసుకెళ్లింది. త్వరలోనే మరిన్ని అద్బుతాలను చూస్తారని మూవీ మేకర్స్ అంటున్నారు. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలో పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మాత సి. అశ్వనీదత్ ఈ మూవీని విడుదల చేయనున్నారు.

ఇది కూడా చదవండి:

Latest News

More Articles