Sunday, May 12, 2024

ఈ స్కీంతో మీ పిల్లల భవిష్యత్‎కు బంగారు బాట.!

spot_img

డబ్బు పొదుపు చేయడం ప్రతిఒక్కరికీ ముఖ్యమే. సరైన ఆర్థిక ప్రణాళికతో డబ్బు పొదుపు చేస్తే భవిష్యత్ బంగారంలా ఉంటుంది. నేటి పొదుపు రేపటి భవిష్యత్తు అనే పెద్దల మాట. భవిష్యత్ అవసరాల కోసం ఎవరైతే ఓ క్రమానుగత పద్ధతిలో పొదుపు చేస్తారో వారికి భవిష్యత్తులో కాసుల వర్షం కురుస్తుంది. అందుకే ప్రజలనుపొదుపు మార్గం వైపు పయనింపజేసేలా సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే బోలెడన్నీ పథకాలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దానిలో ఒకటి సుకన్య సమృద్ధి యోజన. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్ధిక భరోసా ఇచ్చేలా ఈ పథకం రూపకల్పన జరిగింది. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కీం ఇది. ఈ స్కీంలో పెట్టుబడి పెడితే బిడ్డ పెళ్లినాటికి సులభంగా లక్షల్లో డబ్బు కూడబెట్టుకోవచ్చు. పిల్లలు పెద్దవారైన తర్వాత వారి ఉన్నత చదువులతోపాటు పెళ్లి అవసరాలకు ఉపయోగపడేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని డిజైన్ చేసింది.

ఈ స్కీంలో ప్రతినెలా కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టి భవిష్యత్తులో లక్షల రూపాయలు పోగేసుకోవచ్చు. ఆడపిల్ల పుట్టిన మొదటిరోజు నుంచి ఆ బిడ్డకు 10ఏండ్లు వచ్చేలోపు ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. ఆడబిడ్డకు 10ఏళ్లు దాటాక ఈ స్కీంలో చేరే అవకాశం లేదు. ఇందులో ఏడాదికి కనిష్టంగా 250రూపాయల నుంచి గరిష్టంగా 1.5లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. 15ఏండ్ల వరకు ఈ పెట్టుబడి అలాగే కొనసాగించాలి. ఆ తర్వాత మరో 6ఏండ్లు లాకిన్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు మీ మొత్తం సొమ్ము విడుదల అవుతుంది. ఈ పథకంలో 8శాతం వార్షిక వడ్డీ కూడా ఇస్తున్నారు. వడ్డీ అంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ గా జమ అవుతుంది. దీంతో మెచ్యూరిటీ నాటికి ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకోవచ్చు.

బిడ్డ పుట్టగానే ఓ ప్లాన్ ప్రకారం డిపాజిట్ చేస్తే ఆ బిడ్డ పెళ్లి నాటికి లక్షలు, కోట్లు కూడా కూడబెట్టుకోవచ్చు. ఉదాహరణకు బిడ్డ పుట్టిన వెంటనే ఆమె పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరి నెలకు 5వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా 21ఏళ్లకు 27లక్షలు తీసుకోవచ్చు. ఈ పద్దతిలో నెలకు 5వేలు పెడితే ఏడాదికి మీ పెట్టుబడి 60వేలు అవుతుంది. ఇలా 15ఏండ్లపాటు పెడతాం కాబట్టి మొత్తం 9లక్షల పెట్టుబడి అవుతుంది. 15 నుంచి 21 ఏండ్లకు లాకింగ్ పీరియడ్ లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈ మొత్తానికి 8శాతం చొప్పున చక్రవడ్డీ రావడం వల్ల 9లక్షలపై మీకు 17,93,814 జమ అవుతుంది. అంటే మీ 9లక్షల ఈ వడ్డీ జమ అయి మెచ్యూరిటీ పై 26,93,814 వస్తుంది.

ఇది కూడా చదవండి: కల్కి రిలీజ్ డేట్ ఫిక్స్..వచ్చేది ఆరోజే.!

Latest News

More Articles