Sunday, May 12, 2024

వైద్యశాస్త్రంలో ముందడుగు..చర్మ క్యాన్సర్ కు టీకా.!

spot_img

క్యాన్సర్ మహమ్మారితో ఏటా ఎంతో మంది అమాయకులు ప్రాణాలుకోల్పోతున్నారు. క్యాన్సర్ కు ఎలాంటి మందులేదు. చికిత్సకు కూడా లక్షల్లోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. తాజాగా చర్మ క్యాన్సర్ చికిత్సలో ముందడుగు పడింది. మెలనోమా తిరగబడకుండా నిరోధించే టీకాను త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. మోడెర్నా, ఎంఎస్ డీ అనే ఫార్మా కంపెనీలు ఈ వ్యాక్సిన్ ను డెవలప్ చేశాయి. పలు కోవిడ్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ ఆధారిత టెక్నాలజీతో ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. దీనిని ఎంఆర్ఎన్ఏ 4157గా పిలుస్తున్నారు.

కాగా ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కు సంబంధించి రెండో దశ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. మెలనోమా బాధితుల్లో మళ్లీ క్యాన్సర్ తిరగబడే ముప్పును సగం తగ్గించినట్లు తేలింది. ఇఫ్పుడు యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్స్ కు చెందిన వైద్యులు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 1,100 మందిపై క్లినికల్ ట్రయల్స్ జరిగే అవకాశం ఉంది.

ఈ వ్యాక్సిన్ ను మూడు వారాలకు ఒక డోస్ చొప్పును తొమ్మిది డోసులు ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ తోపాటు కీత్రుడా అనే మరో ఔషధాన్ని కూడా ఇస్తారు. మెలనోమా బారిన పడ్డ వారికి సర్జరీ చేసి తొలగించిన కణతుల నుంచి నమూనాను సేకరించి ఏఐ ద్వారా డీఎన్ఏ సీక్వెన్సింగ్ చేసి ఆ రోగి అవసరానికి తగ్గట్లుగా వ్యాక్సిన్ ఇస్తారు. తద్వారా ఈ వ్యాక్సిన్ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను క్యాన్సర్ కణాలను వెంటనే గుర్తిస్తుంది. వాటిని నాశనం చేసేవిధంగా సిద్ధం చేస్తుందని మెలనోమా మళ్లీ తిరగబడకుండా చూస్తుందని యూసీఎల్ హెచ్ ఆంకాలజిస్ట్ హెథెర్ షా తెలిపారు.

ఇది కూడా చదవండి: నార్సింగిలో రూ.10లక్షలు సీజ్

Latest News

More Articles