Sunday, May 12, 2024

ఓటీటీలోనూ దూసుకుపోతున్న టిల్లు స్క్వేర్.!

spot_img

యువ హీరో సిద్ధు జొన్నగడ్డ నటించిన డీజే టిల్లు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. సిద్దూ లీడ్ రోల్లో సీక్వెల్ గా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 29న థియేటర్లలోకి వచ్చింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన టిల్లు 2 విడుదలైన మొదటి రోజు నుంచే మంచిరెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే టిల్లు ఓటీటీలోకి కూడా వచ్చేసింది.

ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ రెస్పాన్స్ తో స్ట్రీమింగ్ షురూ అయ్యింది. థియేటర్లలో ఏ స్థాయిలో స్పందన వచ్చిందో..అదే స్థాయిలో ఓటీటీలోనూ వస్తోంది. నెట్ ఫ్లిక్స్ టీం సమాచారం ప్రకారం టిల్లు 2 తమ ఫ్లాట్ ఫాంలో విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో నిమిషాల వాచింగ్ సమయాన్ని నమోదు చేసింది. సిద్ధూ యాక్టింగ్కు మూవీ లవర్స్ మరోసారి ఫిదా అయిపోతున్నారు. మొత్తానికి థియేటర్లలో రూ. 120 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టిన టిల్లు మరి నెట్ ఫ్లిక్స్ లో రానున్న రోజుల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చూస్తుందో చూడాల్సిందే. కాగా నెట్ ఫ్లిక్స్ లో టిల్లు 2, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ మూవీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ కలిసి నిర్మించారు. ఈ సినిమాకు రామ్ మిర్యాల మ్యూజిక్ అందించాడు.

ఇది కూడా చదవండి: ప్రతిరోజూ సాయంత్రం ఈ శ్లోకాలను పఠిస్తే కష్టాలు తీరుతాయట.!

Latest News

More Articles