Tuesday, May 14, 2024

చివరి నిమిషంలో వాయిదాపడిన ‘గగన్‌యాన్‌’

spot_img

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు చేయాల్సిన ప్రయోగం చివరి నిమిషంలో వాయిదాపడింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం ఉదయం 8 గంటలకు గగన్‌యాన్‌ టెస్ట్‌ వెహికల్‌ను ఇస్రో ప్రయోగించాలని భావించింది. అయితే రాకెట్‎లో సాంకేతిక సమస్య తలేత్తడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. తదుపరి ప్రయోగం ఎప్పుడనేది త్వరలోనే వెల్లడిస్తామని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు.

Read Also: తెలంగాణలో 107 మందిపై అనర్హత వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం

ఈ రాకెట్ ద్వారా ‘క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ’ పనితీరును పరీక్షించనున్నారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా గగన్‌యాన్‌ మిషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సన్నాహకంగా పలు కీలక పరీక్షలను ఇస్రో చేపట్టనుంది. తొలుత క్రూ మాడ్యూల్‌ వ్యవస్థను పరీక్షించనున్నది. అనుకోని ప్రమాదం తలెత్తితే వ్యోమగాములు సురక్షితంగా బయటపడేలా చూసే లక్ష్యంతో ఈ పరీక్షను చేపడుతున్నారు. ఇందులో భాగంగా టీవీ డీ1 రాకెట్‌ ద్వారా క్రూ మాడ్యూల్‌ని నింగిలోకి పంపనున్నారు. అయిదారు గంటలకి తిరిగి భూమిని చేరేలా డిజైన్‌ చేశారు. బంగాళాఖాతంలోకి పడేలా రూపకల్పన చేశారు.

Latest News

More Articles