Monday, May 20, 2024

కాంగ్రెస్‌ పార్టీ.. క్రెడిట్‌ చోర్‌ కాంగ్రెస్‌ పార్టీ

spot_img

హైదరాబాద్: రేవంత్ సర్కారుపై మరోసారి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్ అయ్యాడు.  కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో పూర్తయిన స్టాఫ్‌ నర్సింగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను తమ ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే వాళ్లు చేసిన పనికి సంబంధించిన క్రెడిట్‌ను కొట్టేయడం ఇదే తొలిసారి కాదన్న కేటీఆర్, ఇది చివరి సారి కూడా కాదని అన్నారు. క్రెడిట్‌ చోర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని కాంగ్రెస్‌ పార్టీని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే 6956 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు, 15,750 పోలీస్‌ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌ పూర్తయ్యిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. కానీ, ఎన్నికల కోడ్‌ రావడం వల్ల వాటి ఫలితాలు ప్రకటించలేదని తెలిపారు. వీటిపై కొత్త ముఖ్యమంత్రి రేవంత్ అబద్ధాలు చెప్పడం సిగ్గుమాలిన విషయమని కేటీఆర్ విమర్శించారు.

Also Read.. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రారంభించిన పనులను వెంటనే పూర్తి చేయాలి

Latest News

More Articles