Friday, May 17, 2024

3 ఫీట్లు లేనోడు బీఆర్‌ఎస్‌ పార్టీని వంద ఫీట్ల లోతుకు తొక్కుతాడా?..సీఎం రేవంత్‎కు కేటీఆర్ చురకలు..!

spot_img

బీఆర్ఎస్ ను తొక్కేస్తామన్నోళ్లే పత్తా లేకుండా పోయారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటఆర్. మూడు ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ పార్టీ వందఫీట్ల లోతుకు తొక్కుతాడా అంటూ సీఎం రేవంత్ కు చురకలంటించారు. కేసీఆర్ పై చాలా మంది పిచ్చికూతలు కూస్తున్నారు. గతంలో నీ లెక్కనే పిచ్చిమాటలు, ఉత్తరకుమార ప్రగల్బాలు మీ గురువర్యులు కూడా మాటాడారు. మీకంటే తీస్ మార్ ఖాన్లు మాట్లాడారు..వాళ్లే ఏం చేయలేకపోయారు..నీతో ఏమైతదంటూ ఎద్దేవా చేశారు. నీ నీలాంటోళ్లను మస్తు మందిని చూసిం..వస్తుంటరు..పోతుంటరు..కాలం కలిసివస్తే వానపాము కూడా నాగుపాములా బుసలు కొడుతుందంటు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ఇది కూడా చదవండి: 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటుడు రణ్ బీర్..ఉత్తమ చిత్రం 12th ఫెయిల్..!!

ఆదివారం సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన జరిగిన సిరిసిల్ల నియోజకవర్గ కార్యక్తల సమావేశానికి చీఫ్ గెస్టుగా కేటీఆర్ హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Latest News

More Articles