Saturday, May 4, 2024

ఓటమి స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిదే.. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతాం

spot_img

హైదరాబాద్:  ఓటమి తమకు కొత్తేం కాదని.. అది స్పీడ్‌ బ్రేకర్‌ వంటిదేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పష్టం చేశారు. పదేండ్లపాటు విరామమెరుగక పనిచేసిన కారు.. మరింత స్పీడ్‌గా వెళ్లేందుకు సర్వీసింగ్‌కు పోయిందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహక సదస్సుల్లో భాగంగా భువనగిరి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పాటించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు.

Also Read.. కలెక్టర్ ఆఫీస్ ముందు దళిత బంధు లబ్ధిదారుల ధర్నా

‘‘కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు. అసెంబ్లీలో కాంగ్రెస్‌ విమర్శలను, ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టాము. ఇక స్వయంగా కేసీఆరే అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేరు. రాబోయే పార్లమెంటు, స్థానిక ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసేలా సత్తా చాటాలి.

Also Read.. తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం

ప్రజలు తప్పుచేశారని అనడం సరైంది కాదు. పార్టీ నాయకులు అలా మాట్లాడకూడదు. రెండుసార్లు బీఆర్‌ఎస్‌ను గెలిపించింది కూడా మన ప్రజలే. బీఆర్‌ఎస్‌ను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించలేదు. చాలా చోట్ల స్వల్ప తేడాతోనే ఓడిపోయాం. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సరైన ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్సే.

Also Read.. ఈ వ్యాధులు ఉన్నవారు బొప్పాయి అస్సలు తినకూడదు..!!

నిరుద్యోగ భృతి, పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదాలపై ప్రభుత్వం నాలుక మడతేసింది. యాసంగి వరి నాట్లకు ఎదురుచూస్తున్న రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి. రైతుబంధు ఆపేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వ రైతు వ్యతిరేక ధోరణికి నిదర్శనం. రైతు రుణమాఫీ, పింఛన్ల పెంపును డిసెంబర్‌ 9 వరకు అమలు చేస్తామని అన్నారని.. ఏమైంది.’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

Latest News

More Articles