Monday, May 13, 2024

హరీష్ రావుపై కేటీఆర్ ప్రశంసలు.. మెదక్ మీటింగ్ హైలైట్స్

spot_img

నేడు జరిగిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ ల చీకటి ఒప్పందాలపై విరుచుకుపడ్డారు. ‘ కాంగ్రెస్ నోటికి ఎంత వస్తె అంత అనుకుంటూ హామీలు ఇచ్చారు. అందుకే 420 హామీలను చేసేదాకా విడిచి పెట్టం. ప్రధాని, ఆదాని ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాహుల్ గాంధీ నిన్ననే అదానీని తిడితే, రేవంత్ రెడ్డి అదే సమయంలో దావొస్ లో ఒప్పందం చేసుకున్నారు.నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్, బిజెపి నాయకుల అసలు రంగు బయట పడుతున్నది.

కేసీఆర్ ఉన్నంత కాలం ఆదాని ఇక్కడ అడుగు పెట్టలేదు. కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నాడు. ఇక హరీశ్ రావు గారి నాయకత్వంలో కార్యకర్తలంతా క్రియాశీలకంగా పని చేయడంతో గత ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించాం. ఈ సారి కూడా మెదక్ లో గులాబీ జెండా ఎగరబోతున్నది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గత పదేళ్ళలో తెలంగాణ తరుపున గళం విప్పింది మన బిఆర్ఎస్ ఎంపీలు అనే విషయం మరచి పోవద్దు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బి ఆర్ ఎస్ మాత్రమే. మన బలం, మన గళం, మన గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలి. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగుతుందని. ఇదే విషయం ప్రజలకు చెప్పాలి. నిరాశ వీడాలి. బయటికి రావాలి.

Latest News

More Articles