Sunday, April 28, 2024

మెదక్ మీటింగ్ లో విరుచుకుపడ్డ కేటీఆర్

spot_img

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పలు కీలక కామెంట్స్ చేశారు. ‘గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుళ్ళ అయ్యిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలం అయ్యిందని అబద్ధాలు మాట్లాడించారు. అందుకే స్వేద పత్రం విడుదల చేశాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధిని పొందుపరిచాం. గణాంకాలు, ఆధారాలతో సహా వివరించాం. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు. మొత్తం లెక్క తెస్తే 420 హామీలు ఇచ్చారు. దీన్ని ఎండగట్టే బాధ్యత మనందరి మీద ఉంది.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉండి, అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోండి అన్నరు. తుమ్మల నాగేశ్వర రావు గారు రుణాలు వసూలు చేయాలి అని ఆదేశాలు జారి చేశారు. లేకుంటే కేసులు పెట్టండి అని అంటున్నాడు. పత్రికల్లో కూడా వచ్చింది. ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, భట్టి గారు భృతి ఇస్తామని చెప్పలేదని హరీష్ రావు గారు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామి ఇచ్చారు కానీ అది సాధ్యం కాదని మొన్న స్పష్టమైంది’ అని అన్నారు కేటీఆర్.

Latest News

More Articles